Kasani Gnaneshwar: ముందస్తు చర్యల్లో సర్కార్ విఫలం.. అందుకే భారీ నష్టం
ABN , First Publish Date - 2023-07-31T13:38:19+05:30 IST
వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Telangana TDP Chief Kasani Gnaneshwar) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వరదలతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని.. వరంగల్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భారీ నష్టం కలిగిందన్నారు. చనిపోయిన కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం, ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ తరపున వరద ప్రాంతాల్లో దుప్పట్లు.. నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వరద బాధితులకు రూ.10 వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం వలనే ప్రాణ నష్టం జరిగిందని కాసాని జ్ఞానేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.