TS News: హయత్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2023-07-30T23:47:51+05:30 IST

నగరంలోని హయత్‌నగర్ పోలీసు‌స్టేషన్ (Hayat Nagar Police Station) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

TS News: హయత్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య ఘర్షణ

హైదరాబాద్(Hyderabad): నగరంలోని హయత్‌నగర్ పోలీసు‌స్టేషన్ (Hayat Nagar Police Station) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌(Badangpet)లో ప్రజా సమస్యల పరిష్కరం కోసం బీజేపీ(BJP) ధర్నా చేపట్టింది. ఈ ధర్నా చేస్తున్న దళితులను అరెస్ట్ చేసి హయత్‌నగర్ పీఎస్‌కు తరలించారు. బాధితులకు మద్దతుగా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajender) వచ్చారు. ఈటెల రావడంతో హయత్‌నగర్ పీఎస్ నుంచి అందెల శ్రీరాములుతో పాటు బీజేపీ నాయకులను పోలీసులు బయటకు పంపించారు.

బయటకు పంపుతున్న సమయంలో బీజేపీ నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం హయత్‌నగర్ పోలీసు‌స్టేషన్ వద్ద పోలీసులకు, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS GOVT) సమస్యలను గాలికి వదిలేసి మీనమేషాలు లెక్కిస్తోందని కమలం నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

Updated Date - 2023-07-30T23:53:34+05:30 IST