Hyderabad: నిఘాతో పట్టుబడ్డ డ్రగ్స్... ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2023-09-04T15:37:03+05:30 IST

పోలీస్ ఐడీ కార్డుతో సునయాసంగా చెక్ పోస్టులను దాటుతున్నాడని చెప్పుకొచ్చారు. వీరేందర్ డ్రగ్స్ కోసం ప్రతాప్ శర్మకు ఆర్డర్ ఇచ్చాడని.. ప్రతాప్ శర్మ.. వీరేందర్‌కు డ్రగ్స్ సప్లై చేయడానికి నగరానికి వచ్చాడని తెలిపారు. నిఘా ఉంచడంతో

Hyderabad: నిఘాతో పట్టుబడ్డ డ్రగ్స్... ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 215 ఎండీఎంఏ (MDMA) గ్రాముల డ్రగ్స్ సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్‌కు చెందిన హోంగార్డ్ ప్రతాప్ శర్మతో పాటు కామారెడ్డికి చెందిన వీరేందర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిద్దరి నుంచి రూ.8500 నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామన్నారు. హోంగార్డ్ ప్రతాప్ శర్మ కొరియర్‌గా ఉంటూ వివిధ రాష్ట్రాలకు ఎండీఎంఏ సప్లై చేస్తున్నాడని వెల్లడించారు. పోలీస్ ఐడీ కార్డుతో సునయాసంగా చెక్ పోస్టులను దాటుతున్నాడని చెప్పుకొచ్చారు. వీరేందర్ డ్రగ్స్ కోసం ప్రతాప్ శర్మకు ఆర్డర్ ఇచ్చాడని.. ప్రతాప్ శర్మ.. వీరేందర్‌కు డ్రగ్స్ సప్లై చేయడానికి నగరానికి వచ్చాడని తెలిపారు. నిఘా ఉంచడంతో జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ప్రతాప్ శర్మకు డ్రగ్స్ సప్లై చేస్తున్న నెట్‌వర్క్ గురించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని తెలిపారు. అలాగే మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలకు కూడా తెలిసే అవకాశం ఉందన్నారు. ప్రతాప్ శర్మ, వీరేందర్‌‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో గతంలో ఓ కేసు ఉందని.. వీరేందర్ అరెస్ట్‌కాగా.. ప్రతాప్ శర్మ మాత్రం పరారీలో ఉన్నాడని డీసీపీ జోయల్ డేవిస్ వివరించారు.

Updated Date - 2023-09-04T15:37:03+05:30 IST