BSP: తొలి జాబితా విడుదల.. ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారంటే..?
ABN , First Publish Date - 2023-10-03T20:41:12+05:30 IST
వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(Dr. RS Praveen Kumar) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(Dr. RS Praveen Kumar) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సటీ ప్రకటించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదు. ఆచరణ కానీ హామీలతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మానిఫెస్టోలను ప్రకటిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకోని సమగ్ర కుటుంబ సర్వేను సీఎం కేసీఆర్ బయట పెట్టడం లేదు. ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడమా? మాది ప్రజాబలం ఉన్న పార్టీ. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఉన్నది ధనబలమే... ప్రజా బలం కాదు. ప్రజల సొమ్మును కేసీఆర్ స్వార్థానికి వాడుకుంటున్నారు’’ అని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.
బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..
1.సిర్పూర్ - డా.ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్
2. జహీరాబాద్- జంగం గోపీ
3.పెద్దపల్లి- దాసరి ఉష
4.దేవరకొండ - డా.ముడావత్ వెంకటేష్ చౌహాన్
5. చొప్పదండి - కొంకటి శేఖర్
6.పాలేరు - అల్లిక వెంకటేశ్వర్ రావు
7.నకిరేకల్ - మేడి ప్రియదర్శిని
8.వైరా - బానోత్ రాంబాబు నాయక్
9.ధర్మపురి - నక్క విజయ్ కుమార్
10. వనపర్తి - నాగమోని చెన్న రాములు
11. మనకొండూరు - నిషాని రామచందర్
12.కోదాడ - పిల్లిట్ల శ్రీనివాస్
13.నాగర్ కర్నూల్ - కొత్తపల్లి కుమార్
14.ఖానాపూర్ - బాన్సీలాల్ రాథోడ్
15.అందోల్ - ముప్పారపు ప్రకాష్
16.సూర్యాపేట - వట్టే జానయ్య యాదవ్
17.వికారాబాద్ - గోర్లకాడి క్రాంతి కుమార్
18.కొత్తగూడెం - ఎర్ర కామేష్
19.జుక్కల్ - ప్రధ్న్య కుమార్ మాధవరావు