TS GOVT: కొవిడ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Dec 23 , 2023 | 08:32 PM
కరోనా ( Corona ) విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ( Minister Damodar Rajanarsimha ) కీలక ఆదేశాలు ఇచ్చారు. శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... పని చేయని PSA ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు.
హైదరాబాద్: కరోనా ( Corona ) విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ( Minister Damodar Rajanarsimha ) కీలక ఆదేశాలు ఇచ్చారు. శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... పని చేయని PSA ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులను సాంకేతికపరమైన యంత్రాలను రెడీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రభుత్వ ల్యాబ్‌లలో 16500 శాంపిల్స్ టెస్ట్ చేసే సామర్థ్యం ఉందని మంత్రికి ఉన్నతాధికారులు తెలియజేశారు.
ప్రభుత్వంతో పాటు 84 ప్రైవేట్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. గత రెండు వారాల నుంచి 6 వేలకు పైగా నమూనాలను సేకరించామని అధికారులు తెలిపారు. కోవిడ్ టెస్టుల సామర్థ్యం పెంచాలని కనీసం రోజుకు 4000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఆదేశించారు. కోవిడ్ 19 రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు పత్రికా ప్రకటన కోసం సమర్పించాలని మంత్రి అధికారులకు సూచించారు. గత 4 సంవత్సరాల CSR విరాళాల జాబితాను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.