Revanth Reddy: తెలంగాణలో మహిళా ఐఏఎస్‌కే రక్షణ లేదు
ABN , First Publish Date - 2023-01-22T12:18:57+05:30 IST
అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ చొరబడిన అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ చొరబడిన అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. ఐఏఎస్ స్మితాసబర్వాల్ (IAS Smithasabarwal) వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కే భద్రత లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. తెలంగాణలో మహిళా ఐఏఎస్ కే రక్షణ లేదని.. ఇదేనా తెలంగాణ మోడల్ అని ప్రశ్నించారు. డయల్ 100 అని స్మితాసబర్వాల్ అంటుంటే.. కేసీఆర్(Telangana CM KCR)100 పేపర్ బ్రాందీ అంటున్నారని రేవంత్ రెడ్డి యెద్దవా చేశారు.