Telangana Elections: కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ
ABN , First Publish Date - 2023-10-30T12:50:16+05:30 IST
టీజేఎఫ్ చీఫ్ కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌కు చేరుకున్న రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు.. కోదండరాంను కలిశారు.
హైదరాబాద్: టీజేఎఫ్ చీఫ్ కోదండరాంతో (TJS Chief Kodandaram) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) భేటీ అయ్యారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌కు చేరుకున్న రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు.. కోదండరాంను కలిశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోదండరాంనను రేవంత్ కోరనున్నారు.
కాగా.. కలిసి పనిచేద్దామని ఇప్పటికే ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ అగ్రనత రాహుల్‌తో భేటీ అయి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కోదండరాం అంగీకారానికి వచ్చారు. అలాగే ఢిల్లీ వెళ్లి ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని రేవంత్ కోరనున్నారు. ప్రభుత్వం వచ్చాక కోదండరాంకు సముచిత గౌరవం ఇస్తామని రేవంత్ చెప్పనున్నట్టు తెలుస్తోంది.