Share News

Revanthreddy: ఉత్తమాటలు.. ఎదురుదాడులు కాదు.. కవితకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2023-10-14T15:41:12+05:30 IST

తెలంగాణలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Revanthreddy: ఉత్తమాటలు.. ఎదురుదాడులు కాదు.. కవితకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది (CM KCR) అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేసిన ట్వీట్‌‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాలపై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా!? లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా!? లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే… ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేక విద్యార్థుల ఉసురుపోసుకోవడమా!? ఉత్త మాటలు… ఎదురు దాడులు కాదు… ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారో, ఎన్ని లక్షల ఖాళీలు ఉన్నాయో, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయించండి’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Updated Date - 2023-10-14T15:41:12+05:30 IST