T.Congress: కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇది చేయాల్సిందే
ABN , First Publish Date - 2023-08-18T14:14:01+05:30 IST
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీపీసీసీ స్వీకరించనుంది.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) తరుపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీపీసీసీ (TPCC) స్వీకరించనుంది. ఇందులో భాగంగా శుక్రవారం దరఖాస్తుల ఫాంను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ ధరఖాస్తుదారులకు రూ.25 వేలు, బీసీ, ఓసీలకు 50 వేల రూపాయల ధరఖాస్తు రుసుముగా ఖరారు చేసినట్లు తెలిపారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని.. దరఖాస్తు రుసుము పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు. ఈ నెల 25 తర్వాత దరఖాస్తులను స్క్రూటీని చేస్తామన్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామన్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిక ఇస్తామని చెప్పారు. చివరిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మీడియాలో అభ్యర్థులు ఖరారు అని వచ్చే వార్తలు అవాస్తవమని అన్నారు. 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టిక్కెట్ అడిగితే పీఏసీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.