KishanReddy: కేసీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-02-13T13:24:21+05:30 IST

దేశ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

KishanReddy: కేసీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఏంటంటే..

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి (Economic condition of the country)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దేశ ఆర్థిక వ్యవస్థ దిగిజారిందంటూ తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌ (BRS Chief)కు కేంద్రమంత్రి సవాలు విసిరారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను బంగ్లాదేశ్, శ్రీలంక, తదితర దేశాలతో పోల్చారు. దీనిపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం. ప్రెస్‌క్లబ్, గన్‌పార్క్, ప్రగతి భవన్‌, ఫార్మ్‌హౌస్‌లో ఎక్కడ చర్చకు వస్తారు. రాజీనామా పేపర్ జేబులో పెట్టుకుని వస్తారా. చర్చలో కల్వకుంట్ల కుటుంబం భాష కాకుండా తెలంగాణ భాష మాత్రమే మాట్లాడాలి’’ అంటూ కిషన్‌ రెడ్డి సవాల్ చేశారు.

అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా కేసీఆర్ (CM KCR) అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక స్థితి గురించి మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ (Telangana State) ఆర్థిక పరిస్థితిపై మాత్రం పెదవి విప్పలేదన్నారు. ఇవి తెలంగాణ బడ్జెట్ సమావేశాలా (Telangana Budget Session) లేక... మోదీ వ్యతిరేక సమావేశాలా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. రాష్ట్రంలోని వైఫల్యాలపై మాట్లాడని కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆధారాలేని విమర్శలు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ బలపడుతుందని.. బడ్జెట్ మీటింగ్‌ను రాజకీయ సమావేశాలుగా మార్చుకున్నారని కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు.

కేసీఆర్.. తోడా సబర్ కరో...

సభలో చెప్పిన తిరుమలరాయుని పిట్ట కధ కేవలం కేసీఆర్‌కే వర్తిస్తుందన్నారు. రాజీనామాకు సిద్ధమని కేసీఆర్‌ అంటున్నారని... కేసీఆర్ రాజీనామాకు తొందర ఎందుకని ప్రశ్నించారు. ‘‘రాజీనామా పేపరు జేబులో పెట్టుకొని తిరుగుతారంట. అయ్యా కేసీఆర్.. తోడా సబర్ కరో.. ఇంకా ఎనిమిది నెలలు ఉన్నాయి. ఇంతముందే రాజీనామా పేపరు ఎందుకు పెట్టుకున్నరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ ఇవ్వక తప్పదని’’ యెద్దేవా చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చే నాటి రూ.60వేల కోట్లతో అప్పున్న తెలంగాణ రాష్ట్రం.. నేడు రూ.5లక్షల కోట్ల అప్పు దాటిందన్నారు. అప్పులు చేసి కమిషన్లు కొట్టే ప్రభుత్వం తమది కాదాన్నరు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగోతందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2023-02-13T13:46:52+05:30 IST