Revanth Reddy: విజయభేరీ సభను సక్సెస్ చేయాలి

ABN , First Publish Date - 2023-09-10T21:12:04+05:30 IST

ఈనెల 17వ తేదీన సాయంత్రం 5గంటలకు విజయభేరీ సభ(Vijayabheri Sabha) ఉంటుందని.. ఈ సభకు కాంగ్రెస్(Congress) నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తెలిపారు.

Revanth Reddy: విజయభేరీ సభను సక్సెస్ చేయాలి

హైదరాబాద్: ఈనెల 17వ తేదీన సాయంత్రం 5గంటలకు విజయభేరీ సభ(Vijayabheri Sabha) ఉంటుందని.. ఈ సభకు కాంగ్రెస్(Congress) నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తెలిపారు. ఆదివారం నాడు గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్(Zoom meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..‘‘ఈ నెల 11 నుంచి అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి. 119 శాసనసభ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించుకోవాలి. రాష్ట్రంలోని 35వేల బూత్‌ల నుంచి సభకు కార్యకర్తలు తరలివచ్చేలా చూడాలి. రేపు పార్లమెంట్ అబ్జర్వర్లు, వైస్ ప్రెసిడెంట్స్‌తో సమావేశం నిర్వహిస్తాం. ఆ నేతలు ఈనెల 12,13,14 మూడు రోజుల పాటు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తారు.

జిల్లా పార్టీ అధ్యక్షులు వారితో సమన్వయం చేసుకోవాలి. 17వ తేదీన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరీ సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీ హామీలను విడుదల చేస్తారు. 18వ తేదీన ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారు.18వ తేదీన వారితో కలిసి 5గ్యారంటీలకు సంబంధించి పోస్టర్లను అతికించాలి. ఇంటింటికీ గ్యారంటీ కార్డులను అందజేయాలి. కార్యకర్తలతో భోజనాలు చేయాలి. ఆ తర్వాత సమావేశాలు నిర్వహించి 5 గ్యారంటీ హామీలను వివరించాలి.18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతీ ఒక్కరు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-09-10T21:12:04+05:30 IST