V. Hanuman Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌పై కాంగ్రెస్ నేత వీహెచ్ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-09-11T16:20:38+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ను ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేత వి. హనుమంతురావు(V. Hanuman Rao) ఖండించారు.

V. Hanuman Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌పై కాంగ్రెస్ నేత వీహెచ్ ఏమన్నారంటే..?

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ను ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేత వి. హనుమంతురావు(V. Hanuman Rao) ఖండించారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సరికాదని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు పెట్టిన రాజకీయాలను జగన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకార రాజకీయాలు గతంలో లేవు. జగన్ వచ్చాకనే రాజకీయాలు భ్రష్టు పట్టాయని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టలేదని వీహెచ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-11T16:20:38+05:30 IST