CBI Court: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ 14కు వాయిదా

ABN , First Publish Date - 2023-07-14T12:22:54+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో వాయిదా పడింది.

CBI Court: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ 14కు వాయిదా

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Case)) విచారణ సీబీఐ కోర్టులో (CBI Court) వాయిదా పడింది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం నిందితులు భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కోర్టు గైర్హాజరయ్యాడు. కోర్టుకు హాజరుకానందుకు గాను దస్తగిరి ఆప్సెంట్ పిటిషన్‌ను సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు విచారణను మరోసారి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కేసు వాయిదా పడటంతో నిందితులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి,దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి , ఉమాశంకర్ రెడ్డి , గంగి రెడ్డి, సునీల్ యాదవ్‌లను పోలీసుల తిరిగి చంచల్‌గూడా జైలుకు తరలించారు.

మరోవైపు ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మూడవ చార్జ్‌షీట్‌లో మరో ఇద్దరి పేర్లను సీబీఐ ప్రస్తావించింది. ఏ -9 ప్రకాష్, ఏ -10 కృష్ణా రెడ్డి సస్పెక్ట్ కింద ఇద్దరి పేర్లను చార్జిషీట్‌లో సీబీఐ చేర్చింది. అయితే సాంకేతిక తప్పుల కారణంగా మూడో చార్జ్‌షీట్‌ను మెజిస్ట్రేట్ వెనక్కి పంపారు. తప్పులు సరి చేసుకుని చార్జ్‌‌షీట్‌ను సీబీఐ మరోసారి రీసబ్మిట్ చేసింది. ఈ కేసులో జూన్ 30 నాటి సీబీఐ దర్మాప్తు ముగిసింది.

Updated Date - 2023-07-14T12:22:54+05:30 IST