MLC Kavitha: జగిత్యాలకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత...ఇంతలోనే ఊహించని విషాదం

ABN , First Publish Date - 2023-04-01T12:30:15+05:30 IST

ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణతో సతమతమైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శనివారం జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనాలని భావించారు.

MLC Kavitha: జగిత్యాలకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత...ఇంతలోనే ఊహించని విషాదం

జగిత్యాల: ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam Case)లో ఈడీ విచారణ (ED Enquiry)తో సతమతమైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) శనివారం జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనాలని భావించారు. కానీ ఇంతలోనే కవిత భాగం కావాల్సిన ఆత్మీయ సమ్మేళం కార్యక్రమంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంబరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నృత్యం చేస్తూ బీఆర్‌ఎస్ నేత బండారి నరేందర్ (BRS leader Bandaru Narender) కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈరోజు జగిత్యాల పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ శ్రేణులు అంతా సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఇలాంటి ఘటన జరగడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ బండారు రజిని (BRS Councilor Bandaru Rajini) భర్త నరేందర్ కూడా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అయితే ఉన్నట్టుండి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన బీఆర్‌ఎస్‌ నేతలు హుటాహుటిన నరేందర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. బండారి నరేందర్ మృతితో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో విషాదం చోటు చేసుకుంది. నరేందర్ మృతి విషయం తెలిసిన ఎమ్మెల్సీ కవిత.. జగిత్యాల పర్యటనను రద్దు చేసుకున్నారు.

Updated Date - 2023-04-01T12:30:15+05:30 IST