Dharmapuri Election Issue: ‘ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలని లేదు.. కానీ’

ABN , First Publish Date - 2023-04-10T09:53:20+05:30 IST

ధర్మపురి ఓట్ల లెక్కింపుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించగా..

Dharmapuri Election Issue: ‘ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలని లేదు.. కానీ’

జగిత్యాల: ధర్మపురి ఓట్ల లెక్కింపుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister koppula Eshwar) ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆదేశాలతో నేడు జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్‌రూమ్‌ను తెరువనున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ (Congress Leader) ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy)తో మాట్లాడుతూ... మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని ఆరోపించారు. తనకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉందన్నారు. అక్రమంగా కొప్పుల ఈశ్వర్ మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలని లేదని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సరిగా జరగలేదని అన్నారు. చివరి రౌండులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తప్పు చేయకపోతే.. ఈశ్వర్ ఎందుకు లాయర్లను పెట్టుకున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు.

కాగా.. గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పోరాటం చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. 2018లో అక్రమంగా కొప్పుల ఈశ్వర్ గెలిచారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఇవాళ స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ తెరవనున్నారు. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరవనున్నారు. అనంతరం అందులోని కీలక డాక్యుమెంట్లను నిర్ణిత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-04-10T09:53:20+05:30 IST