Minister KTR: బీసీ బంధు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు

ABN , First Publish Date - 2023-08-08T18:15:49+05:30 IST

సిరిసిల్లా ప్రజలు కరుణిస్తే మళ్లీ గెలుస్తా ..లేకపోతే ఇంట్లో కూచుంటానని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు.

Minister KTR: బీసీ బంధు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు

రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla): సిరిసిల్లా ప్రజలు కరుణిస్తే మళ్లీ గెలుస్తా ..లేకపోతే ఇంట్లో కూచుంటానని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. మంగళవారం సిరిసిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఏదైనా మొదలు పెడితే పక్క నియోజక వర్గాల వారు ఏడుస్తున్నారు..అందుకే సీక్రెట్‌గా చేప్తున్నా.. ఓట్లప్పుడు మందు పంచడం ..డబ్బులివ్వడం లాంటి అలవాటు లేదని కేటీఆర్ చెప్పారు.బీసీ బంధు(BC bandhu) కింద చేసే ఆర్థిక సహాయం గ్రాంట్ మాత్రమే .. అది మీరు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నియోజక వర్గానికి 3000 చొప్పున గృహలక్ష్మి ఆర్థిక సహాయం చేస్తామని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2023-08-08T18:15:49+05:30 IST