TS Assembly Polls: రాహుల్‌తో భేటీ తర్వాత కోదండరాం సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2023-10-20T10:18:44+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం కరీంనగర్ వి పార్క్‌లో రాహుల్‌తో భేటీ అనంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో కోదండరాం మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు.
కరీంనగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో (Congress leader Rahul Gandhi) భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం (TJS Chief Kodandaram) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం కరీంనగర్ వి పార్క్‌లో రాహుల్‌తో భేటీ అనంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో కోదండరాం మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను (BRS) గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దు బాటుపై మరోసారి సమావేశం అవుతామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత క్లారిటీ వస్తుందన్నారు. తమ లక్ష్యం నియంత్రత్వ కేసీఆర్‌ను ఓడించడమే అని కోదండరాం స్పష్టం చేశారు.
కాగా.. తెలంగాణ ప్రయోజనల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నియంత పాలన దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరాం వెల్లడించారు.