RevanthReddy: కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి బలయ్యాడన్న టీపీసీసీ చీఫ్

ABN , First Publish Date - 2023-03-18T11:10:35+05:30 IST

టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీతో మనస్థాపానికి గురై సిరిసల్లకు చెందిన నవీన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.

RevanthReddy: కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి బలయ్యాడన్న టీపీసీసీ చీఫ్

కామారెడ్డి: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)తో మనస్థాపానికి గురై సిరిసిల్లకు చెందిన నవీన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ (Telangana CM) రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యారన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్... తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడని అన్నారు. కేసీఆర్‌పై హత్యనేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. ‘‘మీకు కాంగ్రెస్ (Congress) అండగా ఉంటుంది. పోరాటం చేద్దా’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఓ నిరుద్యోగి ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లాలోని బివైనరగ్‌కు చెందిన నవీన్ కుమార్ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగాన్వేషణలో విసిగిపోయి.. ప్రాణాలు తీసుకునే ముందు నవీన్ రాసిని సూసైడ్ లెటర్ అందరినీ కంటతడి పెట్టించింది. గ్రామానికి చెందిన చిటికెన నాగభూషణం, సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో నవీన్ కుమార్ చిన్నవాడు. నవీన్ సాఫ్ఠ్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం, ఆ తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర మనస్థాపానికి గురైన నవీన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘అన్ సాటిస్ఫైడ్ లైఫ్.. నో వన్ ఇస్ రీజన్ ఫర్ దిస్… ఐ యాం యూస్ లెస్ ఫర్ ఆల్ జాబ్ లెస్.. థాంక్యూ టు మై ఫ్యామిలీ… ఐ క్విట్స్‌’’ అంటూ నవీన్ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టించింది.

Updated Date - 2023-03-18T12:37:46+05:30 IST