Etala Rajender: కేసీఆర్‌ది చేత కానీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-09-23T21:39:39+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదని.. చేత కానీ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదని.. చేత కానీ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు. శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. మణుగూరులోనీ గిరిజన భవన్లో బీజేపీ(BJP) ముఖ్య నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి గ్రామంలో డబల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదలందరికీ ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ నామమాత్రoగా నలుగురికి మాత్రమే ఇచ్చారు. ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే వాటిని రద్దు చేస్తారా..? ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు. పోడు పట్టాలిస్తానని చెప్పి నామమాత్రంగా కొంతమందికి ఇచ్చి ఏళ్ల తరబడి పోడు చేసుకుంటున్న గిరిజనుల దగ్గర నుంచి పొలాలు లాక్కుంటున్నాదు. ఎదురుతిరిగిన పోడు రైతులను కేసుల పాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం భార్యాభర్తల మధ్య గొడవలు రేపుతూ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు రావా ఇంకెప్పుడు ఇస్తారు..? బీజేపీ ప్రభుత్వం వస్తే 55 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్లు ఉంటే ఇద్దరికి కూడా ఇస్తాం. బీజేపీ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలి’’ అని ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.