Bhatti Vikramarka: కొత్తగూడెంన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
ABN , First Publish Date - 2023-12-10T17:41:59+05:30 IST
కొత్తగూడెం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు జిల్లాలోని పాల్వంచ సుగుణ గార్డెన్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య , మట్టా రాగమయి జారే ఆదినారాయణ, రాందాస్కి సన్మానం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కమాట్లాడుతూ...‘‘గత ఎన్నికల్లో గెలిపించిన ఎమ్మెల్యే పార్టీ మారితే ఈ ఎన్నికల్లో కూనంనేనిని గెలిపించారు. మార్పు కోసం 9 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీని గెలిపించారు. రాజకీయాలను ప్రజా సేవగా చేయాలనే తపన ఉన్న నాయకుడు కూనంనేని. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉందని చెప్పారు.