Tummala Nageswara Rao: స్వామినాథన్ దేశ వ్యవసాయ రంగం దశా దిశా మార్చారు
ABN , First Publish Date - 2023-09-28T16:46:25+05:30 IST
దేశ వ్యవసాయ రంగం దశా దిశా మార్చిన యోధుడు ఎం.ఎస్ స్వామినాథన్(MS Swaminathan) అని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం: దేశ వ్యవసాయ రంగం దశా దిశా మార్చిన యోధుడు ఎం.ఎస్ స్వామినాథన్(MS Swaminathan) అని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. గురువారం నాడు తుమ్మల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల తుమ్మల సంతాపం తెలిపారు. ఈసందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ...‘‘కరువు రక్కసి కోరల్లో చిక్కిన దేశానికి హరిత విప్లవంతో స్వామినాథన్ బాటలు వేశారు. హరిత విప్లవ పితామహడు.. ఆయన మృతి తీరని లోటు. కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపి దేశానికి ఆహార భద్రత కోసం పరితపించిన మహర్షి. స్వామినాథన్ కలలుగన్న హరిత విప్లవం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.