N. Janardhan Reddy: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కేసీఆర్ గొప్పలు చెప్తున్నారు
ABN , First Publish Date - 2023-09-22T15:00:15+05:30 IST
సీఎం కేసీఆర్(CM KCR) హడావుడి ప్రారంభించి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru - Rangareddy Project) నుంచి వచ్చే నీటిని రెండు గంటల పాటే విడుదల చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి(Nagam Janardhan Reddy) వ్యాఖ్యానించారు.
నాగర్ కర్నూల్: సీఎం కేసీఆర్(CM KCR) హడావుడి ప్రారంభించి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru - Rangareddy Project) నుంచి వచ్చే నీటిని రెండు గంటల పాటే విడుదల చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి(Nagam Janardhan Reddy) వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ సమీపంలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ శుక్రవారం నాడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు 9 మోటార్లు ఉంటే ఒక్కటే మోటార్ ప్రారంభించేసి సీఎం కేసీఆర్ గొప్పలు చెప్తున్నారు. 30 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చెప్పారని.. 90 నెలలు అయినా ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. ప్రాజెక్ట్ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. ప్రాజెక్ట్ కాల్వలు, సొరంగాలు పూర్తి కాలేదు. మెయిన్ కెనాల్స్, కెనాలకు, రోడ్డు కటింగ్‌కు టెండర్లు పిలవాలేదు. ప్రాజెక్ట్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.