CM KCR : తెలంగాణకే తలమానికంగా సిద్దిపేట జిల్లా
ABN , First Publish Date - 2023-10-17T19:46:54+05:30 IST
తెలంగాణకే తలమానికంగా సిద్దిపేట జిల్లా నిలిచిందని సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యానించారు.
సిద్దిపేట: తెలంగాణకే తలమానికంగా సిద్దిపేట జిల్లా నిలిచిందని సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..‘‘జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్దిపేట గడ్డ జన్మనిచ్చింది, సాదింది, భాష నేర్పింది, ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. ప్రతి సందర్భంలో నన్ను విజేతగా నిలిపింది ఈ గడ్డ. మిషన్ భగీరథకు సిద్దిపేట మంచినీళ్ల పథకమే పునాది. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి కూడా ఇక్కడే పునాది. సిద్దిపేటకు రానిదెంది.. లేనిదెంది.. గోదావరి జలాలు వచ్చాయి.. రైలు వచ్చింది. సిద్దిపేటకి ఇప్పుడు ఒక్కటే తక్కువ.. గాలి మోటార్ తప్ప. దళితబందుకు కూడా ఇక్కడి రామంచ పునాది. దిక్కుమాలిన కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి కృషి చేయలేదు. ప్రతి కుటుంబానికి దళితబందు అందే దాకా అపేదే లేదు. బీసీ బందు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.