Minister Harish Rao: విద్యకు నిలయంగా సిద్దిపేట
ABN , First Publish Date - 2023-09-11T16:28:28+05:30 IST
విద్య అనేది అన్నింటికంటే గొప్పది, చాలా ముఖ్యమైందని.. విద్యకు ఉన్న శక్తి ప్రపంచలో దేనికి లేదనీ నోబుల్ అవార్డ్ గ్రహీత నెల్సాన్ మండేలా(Nelson Mandela) అన్నారని మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా: విద్య అనేది అన్నింటికంటే గొప్పది, చాలా ముఖ్యమైందని.. విద్యకు ఉన్న శక్తి ప్రపంచలో దేనికి లేదనీ నోబుల్ అవార్డ్ గ్రహీత నెల్సాన్ మండేలా(Nelson Mandela) అన్నారని మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) పేర్కొన్నారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డ్‌లో జిల్లా ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో గురు పూజోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రంలో అత్యధిక మంది విద్యను అభ్యసించిన వారు ఉన్నారన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయులను మరువకూడదన్నారు. తల్లిదండ్రుల వద్ద కన్నా విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నారని చెప్పారు.
సమాజం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయ వృత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు సమకూర్చిన సుమారు 50శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాటశాలలో చదువుతున్నారని చెప్పారు. గతంలో నంది ఎల్లయ్య లాంటి నాయకులు చెప్పిన హామీలు గోడ మీద రాతలుగా మిగిలిపోయయన్నారు. నాటి నినాదాలు నేడు నిజం అవుతున్నాయన్నారు. ఈ నెల 15వ తేదీన సిద్దిపేటకు బుల్లెట్ స్పీడ్‌తో రైల్ వస్తుందన్నారు. సిద్దిపేట డెవలప్‌మెంట్ హబ్‌గా మారిందని.. విద్యకు నిలయంగా, విద్య క్షేత్రంగా సిద్దిపేటను మార్చుకున్నామని వివరించారు.సిద్దిపేటలో దసరా వరకు వెయ్యి పడకల ఆస్పత్రి ప్రారంభిస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు తన సొంతంగా 5లక్షల రూపాయల భీమా ఇస్తానని హరీష్‌రావు పేర్కొన్నారు.