HarishRao: ‘రైతులను ఆదుకుంటాం.. అధైర్య పడొద్దు’

ABN , First Publish Date - 2023-04-26T09:57:37+05:30 IST

రాష్ట్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లపై మంత్రి హరీష్‌రావు స్పందించారు.

HarishRao: ‘రైతులను ఆదుకుంటాం.. అధైర్య పడొద్దు’

సిద్దిపేట్: రాష్ట్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లపై మంత్రి హరీష్‌రావు (Minister Harishrao) స్పందించారు. రాత్రి తీవ్రమైన వడగళ్లతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా రెండు, మూడు వేలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని, వేల కోట్లు ఖర్చు పెట్టి కాస్లీ కరెంట్ రైతులకు అందించామని చెప్పుకొచ్చారు. ఒక్క సిద్దిపేటలోనే మొదటి దశలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నిన్నటి వానతో నష్టం ఎంత అనే వివరాలు రావాల్సి ఉందన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్య పడొద్దని అభయమిచ్చారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే వరి నాట్లు వేసి, కోతలు పూర్తి చేసి నష్టం నుంచి బయట పడ్డారన్నారు. ఇక్కడ కూడా ఒక్క నెల ముందుగా నాట్లు వేసుకుంటే వడగండ్ల బాధను తప్పించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఒక్క నెల ముందుకు సీజన్ తేవడానికి రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-26T09:57:37+05:30 IST