Share News

Ponnam Prabhakar: ఎప్పటికీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటా..

ABN , First Publish Date - 2023-12-11T15:54:02+05:30 IST

Telangana: అనేక బాధ్యతల ద్వారా ఎదిగానని.. ఎప్పటికీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మనముందు ఉన్న కర్తవ్యం పెద్దది అని.. గత పాలకుల తీరు నచ్చక కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేస్తున్నామని చెప్పారు.

Ponnam Prabhakar: ఎప్పటికీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటా..

సిద్దిపేట: అనేక బాధ్యతల ద్వారా ఎదిగానని.. ఎప్పటికీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మనముందు ఉన్న కర్తవ్యం పెద్దది అని.. గత పాలకుల తీరు నచ్చక కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆచరణలో లోపాలను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించుకుని ముందుకు వెళతామన్నారు. రోజు 45 లక్షల మందిని, 35 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ తిరుగుతుందని తెలిపారు. ఆర్టీసీని మరింత ప్రజలకు చేరువ చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం మన భాద్యతగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. వంద రోజుల కాలంలో ఆరు గ్యారంటీ లను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా పని చేస్తామన్నారు. సమస్య ఉంటే పార్టీ ఏదైనా తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. నియంతృత్వం తమ విధానం కాదన్నారు.


గూగుల్ మ్యాప్‌లు నీళ్ళల్లోకి తీసుకుపోతున్నాయని.. గూగుల్‌కు లెటర్ రాయాలని కలెక్టర్‌కు ఆదేశించానన్నారు. గౌరవెళ్లి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని చెప్పానన్నారు. బీసీ బందులో అవకతవకలపై సమీక్ష జరుపతామన్నారు. విద్యుత్ శాఖకు మాత్రమే 85 వేల కోట్ల అప్పు ఉందని తెలుస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఎప్పుడూ డిసెంబర్ చివరి వారంలో ఇచ్చిందని.. ఖచ్చితంగా రైతులకు రైతు బందు ఇస్తామన్నారు. ప్రతి శాఖకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ మనుగడ కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ శ్రేణులు, పోటీ చేసిన అభ్యర్థుల ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని.. వర్గాలకు, విభేదాలకు తావివ్వద్దని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Updated Date - 2023-12-11T15:54:03+05:30 IST