Share News

Ponnam Prabhakar: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2023-12-13T10:26:55+05:30 IST

Telangana: తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. గౌరవెళ్లి, దేవాదుల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగుకు నీళ్లిస్తామన్నారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతుందని తెలిపారు.

Ponnam Prabhakar: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. గౌరవెళ్లి, దేవాదుల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగుకు నీళ్లిస్తామన్నారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట గౌరవెల్లి ప్రాజెక్ట్ అని విమర్శించారు. ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణమే లేదని.. టాంక్ నింపి నీళ్ళు ఇవకుంటే ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. తోటపల్లి భూ నిర్వాసితుల సమస్య ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. అది సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యలను అప్పటి ఎమ్మెల్యే వారితో దురుసుగా ప్రవర్తించి జఠిలం చేశామన్నారు. ఈ సమస్యపై అప్పటి మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించినా, స్థానిక ఎమ్మెల్యే వైఖరి కారణంగా అది ముందుకు సాగలేదన్నారు. డబుల్ బెడ్ రూంలు తమ విధానం కాదని.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అప్పటి సర్కారు అనాలోచితంగా వ్యవహరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-12-13T10:26:57+05:30 IST