TS Police: సంగారెడ్డి జిల్లాలో చోరీ అయిన గంజాయి కేసును ఛేదించిన పోలీసులు
ABN , First Publish Date - 2023-09-26T21:10:15+05:30 IST
సంగారెడ్డి జిల్లా కోర్టు(Sangareddy District Court)లో ఈనెల 16వ తేదీన చోరీ అయిన గంజాయి కేసును తెలంగాణ పోలీసులు(Telangana Police) ఎట్టకేలకు ఛేదించారు.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కోర్టు(Sangareddy District Court)లో ఈనెల 16వ తేదీన చోరీ అయిన గంజాయి కేసును తెలంగాణ పోలీసులు(Telangana Police) ఎట్టకేలకు ఛేదించారు. కోర్టులో ఉన్న గంజాయిని అమ్మి కోర్టులోని జామిను డబ్బులు కట్టాలని ఓ దొంగ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు మహబూబ్ (50)ని గంజాయి చోరీ చేసినట్టు గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో 30 వేల రూపాయల జామిను కట్టడానికి డబ్బులు లేక గంజాయి దొంగ దొంగతనం చేశాడు. గత 14 ఏళ్లుగా కోర్టులో తెలిసిన వాళ్లకి జామినుగా ఉంటూ మహబూబ్ డబ్బులు తీసుకుంటున్నాడు. అలాగే ఓ కేసు విషయంలో క్లయింట్ 30 వేలు కట్టకపోవడంతో మహబూబ్‌ని కట్టాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టులో ఉన్న గంజాయిని దొంగతనం చేసి అమ్మి జామిను డబ్బులు కట్టేందుకు ప్లాన్ వేసి ఎత్తుకెళ్లాడు. కోర్టుకు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో గంజాయి ఎత్తుకెళ్లి అమ్మి డబ్బులు కట్టాలని ప్లాన్ వేశాడు. నిందితుడి దగ్గరి నుంచి 35 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించారు.