గజ్వేల్‌లో ప్రతిపక్షాలకు డిపాజిట్ రాదు: వంటేరు ప్రతాప్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-08-29T19:53:37+05:30 IST
గజ్వేల్(Gajwel)లో ప్రతిపక్షాలకు డిపాజిట్ రాదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి(Pratap Reddy) అన్నారు.
సిద్దిపేట జిల్లా(గజ్వేల్): గజ్వేల్(Gajwel)లో ప్రతిపక్షాలకు డిపాజిట్ రాదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి(Pratap Reddy) అన్నారు. మంగళవారం నాడు గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ (cm kcr) మూడోసారి గజ్వేల్ నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని చెప్పారు.గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలో కేసీఅర్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాల ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్‌కి ప్రజలు ఎదురు తిరిగే రోజులు దగ్గర పడ్డాయని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.