VH: గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..
ABN , First Publish Date - 2023-07-19T14:52:41+05:30 IST
సంగారెడ్డి: గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పిలుపుపిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో ఓబీసీ నాయకుల సమావేశం జరిగింది.
సంగారెడ్డి: గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తుందని, చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (V.Hanumantharao) పిలుపుపిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో ఓబీసీ (OBC) నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని.. ప్రజలే ఆయనను బంగాళాఖాతంలో వేస్తారని అన్నారు. అన్నం పెట్టినోనికి సీఎం సున్నం పెడతారని విమర్శించారు.
దేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) గ్రాఫ్ (Graph) పెరిగిందని, పప్పు అన్న రాహుల్ పప్పా అయ్యారని, ఈ సారి ప్రధాని రాహుల్ అవుతారని.. లేకుంటే తన పేరు హనుమంతరావు కాదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ (Modi) ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆదానికి మోదీకి ఎం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. త్వరలోనే బీసీ గర్జన సభ నిర్వహిస్తామని, అందుకు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారని చెప్పారు. అగ్రకులాల వాళ్ళు ఒబీసీ (OBC) లను అనగదొక్కుతున్నారని అన్నారు.
రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారని, కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారని.. ముందు 20 శాతం తెచ్చుకుందామని, ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దామని హనుమంతరావు అన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. ‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.