Share News

MLA Sitakka: ఎమ్మెల్యే సీతక్క సంచలన కామెంట్స్.. నేను గెలిచినందునే ములుగు జిల్లా అయింది

ABN , First Publish Date - 2023-10-14T13:23:45+05:30 IST

నేను గెలిచాను కాబట్టే ములుగును జిల్లా చేశారు... నేను పోరాటం చేసినందుకే అభివృద్ధి నిధులు ఇచ్చారని... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి

MLA Sitakka: ఎమ్మెల్యే సీతక్క సంచలన కామెంట్స్.. నేను గెలిచినందునే ములుగు జిల్లా అయింది

ములుగు: నేను గెలిచాను కాబట్టే ములుగును జిల్లా చేశారు... నేను పోరాటం చేసినందుకే అభివృద్ధి నిధులు ఇచ్చారని... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ములుగు జిల్లాను శాశ్వతంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క(Mulugu MLA Dhanasari Sitakka) అన్నారు. శుక్రవారం ములుగు(Mulugu) మండలంలోని జంగాలపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరగగా ఆమె పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలే నా కుటుం బమని, నా కుటుంబంలో చావైనా, బతుకైనా, శుభకార్యాలైనా పిలుస్తు న్నారని, ఒక ఆడబిడ్డగా నేను వస్తే ఓర్చుకోలేని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నా గెలుపు వల్ల ములుగు జిల్లా అయిందని, నేను అడిగితేనే ములుగులో సమీకృత కలెక్టరేట్‌, హెల్త్‌ ప్రొఫైల్‌, మెడికల్‌ కళాశాల, మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం(Eturunagaram) రెవెన్యూ డివిజన్‌ అయిందని, పోడు భూములకు పట్టాల జారీ జరిగిందని అన్నారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దీంతో ములుగు జిల్లాను రాష్ట్రంలోనే అత్యాధునికంగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. గోదావరి జలాలను జిల్లాలోని చెరువులకు మళ్లించి సాగునీటి కష్టాలను తొలగిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళిరెడ్డి, నాయకులు మల్లాడి రాంరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నామా కరంచంద్‌గాంధీ, పుష్పలత, గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్‌, బానోత్‌ రవిచందర్‌, వంగ రవి యాదవ్‌, దాసరి సుధాకర్‌, అయూబ్‌ఖాన్‌, కంబాల రవి, జగన్మోహన్‌ రెడ్డి, ఇర్సవడ్ల వెంకన్న, భగవాన్‌రెడ్డి, సత్తిరెడ్డి, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

sitakka.jpg

Updated Date - 2023-10-14T13:23:45+05:30 IST