MLC Kavitha: మరోసారి సుప్రీంకోర్టుకు కవిత
ABN , First Publish Date - 2023-03-16T23:00:22+05:30 IST
ఈడీ విచారణ (ED investigation)పై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉండడంతో మరోసారి పిటిషన్ కోసం కవిత సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. రే
ఢిల్లీ: ఈడీ విచారణ(ED investigation)పై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉండడంతో మరోసారి పిటిషన్ కోసం కవిత సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. రేపే తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుని కోరనున్నారు. 20వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తాజా నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఎమ్మెల్సీ కవిత , బీఆర్ఎస్ (BRS)పై కేంద్రం (Central Government) కక్ష కట్టిందని ఆమె లాయర్ సోమా భరత్ మీడియాకు వెల్లడించారు. ఉదయం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కవిత ప్రెస్‌మీట్, ఆపై విచారణకు హాజరవుతున్నారంటూ పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. ప్రెస్‌మీట్ లేదు.. విచారణ లేదు.. అసలు కేసీఆర్ (CM KCR) నివాసం నుంచి కవిత బయటకు వచ్చిందే లేదు. ఆ తరువాత ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో పంపించారు. తన అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చింది. ఈడీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో కవిత తదుపరి స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఈడీకి కవిత లేఖను అందజేసిన అనంతరం ఆమె లాయర్ సోమా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత తరపున ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు. ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టు తెలిపారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందన్నారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరపాలన్నారు. ఈడీ ఎలాంటి నోటీసు, డేట్స్ ఇవ్వలేదని కవిత లాయర్ భరత్ వెల్లడించారు.