MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంతో సంబంధమేంటి?

ABN , First Publish Date - 2023-03-12T04:04:15+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంతో సంబంధమేంటి?

స్కాంలో మీ పాత్ర ఉందా? లేదా?.. పిళ్లై మీకు బినామీయా? కాదా?

సౌత్‌ గ్రూప్‌లో మీ వాటా ఎంత? ఆ డబ్బులెక్కడివి?

ఆప్‌తో మీకున్న రాజకీయ సంబంధాలేంటి?

సెల్‌ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారు?

ఎమ్మెల్సీ కవితకు ఈడీ ప్రశ్నల పరంపర

ఉద్రిక్తతల మధ్య హాజరు.. 9 గంటలు విచారణ

మొబైల్‌ను ఇంటినుంచి తెప్పించి స్వాధీనం

16న మరోసారి విచారణకు రావాలని నోటీసు

అరెస్టు చేయకపోవడంతో శ్రేణులకు ఊరట

ఢిల్లీలో కవితకు అండగా కేటీఆర్‌, హరీశ్‌

బీఆర్‌ఎస్‌, భారత్‌ జాగృతి కార్యకర్తల హల్‌చల్‌

కేసీఆర్‌ నివాసం, ఈడీ ఆఫీసు వద్ద భారీ భద్రత

హైదరాబాద్‌ చేరుకున్న కవిత, కేటీఆర్‌, హరీశ్‌

6.jpg

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మూడురోజుల క్రితం అందిన సమన్ల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్‌లో విద్యుత్‌ లేన్‌లో ఉన్న ప్రవర్తన్‌ భవన్‌లో ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. బీఆర్‌ఎస్‌, భారత్‌ జాగృతి కార్యకర్తల నిరసనల నడుమ హాజరైన కవితను ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు.. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.

BRS-MLC-K-Kavitha--02.jpg

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధానంగా, ‘‘ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకు సంబంధమేంటి? మద్యం కుంభకోణంలో మీ పాత్ర ఏమిటి? మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై మీ బినామీయా? కాదా? ఈ వ్యాపారంలో మీరు ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు? ఇండో స్పిరిట్‌లో 32.5 శాతం వాటాతోపాటు పెర్నాడ్‌ రికార్డ్‌ పంపిణీదారుగా కూడా మీకు భాగస్వామ్యం ఉందా? సౌత్‌ గ్రూప్‌లో మీ వాటా ఎంత? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హవాలా ద్వారా ఢిల్లీకి పంపిన డబ్బులు ఎవరివి? ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో మద్యం వ్యాపారులు, ఆప్‌ నేతలతో మీరు సమావేశమయ్యారా? అక్కడ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌లను కలుసుకున్నారా? ఆప్‌తో మీకు ఉన్న రాజకీయ సంబంధాలేమిటి? పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఆప్‌కు నిధుల సహాయం చేశారా? హైదరాబాద్‌లో కూడా మీ నివాసంలో ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రును కలుసుకున్నారా? లేదా? దాదాపు పది ఫోన్లను ఎందుకు ఽమార్చాల్సి వచ్చింది? లేదా ధ్వంసం చేయాల్సి వచ్చింది? హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు విజయ్‌ నాయర్‌తో మీ ప్రేరణతోనే చర్చలు జరిపారా?’’ వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్లు సమాచారం.

DSC_0986-c.jpg

విజయ్‌ నాయర్‌, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి తదితరులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా కవిత ముందు పెట్టి.. వాటి ఆదారంగా నిజానిజాలను వివరించాలని కూడా ఈడీ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీలోనే ఉన్నా.. శనివారం ఆయనను ముఖాముఖి ప్రవేశపెట్టలేదని తెలుస్తోంది. అయితే విచారణ ఇంతటితో ముగియలేదని, 16న మరోసారి హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు సూచించారు.

DSC_5223.jpg

కవిత సెల్‌ఫోన్‌ స్వాధీనం..

కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె బయోమెట్రిక్‌, ఐరిస్‌ వివరాలను సిబ్బంది సేకరించారు. సమన్ల వెరిఫికేషన్‌ తర్వాత కొన్ని ఫారాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండో అంతస్తుకు తీసుకెళ్లి ఆమెను ఒక గదిలో కూర్చోబెట్టారు. దర్యాప్తు అధికారి జోగీందర్‌ నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించిందని, అందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారని తెలుస్తోంది. మధ్య మధ్యలో వారు బయటకు వెళ్లి పైఅధికారుల నుంచి ఆదేశాలు తీసుకునివచ్చి మళ్లీ ప్రశ్నించడం మొదలుపెట్టారని సమాచారం. కాగా కవితను ప్రశ్నిస్తున్న సమయంలో ఒక అధికారి.. ఆమె ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ ఇవ్వాల్సిందిగా అడిగారు. అయితే తాను తుగ్లక్‌రోడ్‌లోని ఇంట్లో వదిలివచ్చానని కవిత చెప్పడంతో ఆమె డ్రైవర్‌ను ఇంటికి పంపి ఆ ఫోన్‌ను తెప్పించుకున్నారు. ఆ తర్వాత దానిని వారు స్వాధీనపర్చుకున్నారు. సాయంత్రం 4గంటల వేళ విచారణకు విరామం ఇచ్చి ఈడీ క్యాంటీన్‌లో ఫలహారం తీసుకునేందుకు అనుమతించినట్లు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ విచారణ కొనసాగించారు. రాత్రి 8గంటల సమయంలో విచారణ ముగిసిన తర్వాత కవిత నేరుగా సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసానికి వెళ్లిపోయారు.

144 సెక్షన్‌ అమలు..

కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం, ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, ఢిల్లీ పోలీసులు ఆయా చోట్ల మోహరించారు. 144 సెక్షన్‌ విధించారు. ఈడీ కార్యాలయానికి బీఆర్‌ఎస్‌, భారత్‌జాగృతి కార్యకర్తలు రాకుండా ఉండేందుకు రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. కవిత తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరగానే కేసీఆర్‌ నివాసం వద్ద కార్యకర్తలు ఆమె కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు పక్కకు తప్పించారు. వారు ఈడీ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు.

08.jpg

అరెస్టు చేయకపోవడంతో ఊరట

విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరగగా.. శనివారం అలాంటిదేమీ లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి విచారణ గంటల తరబడి కొనసాగుతున్న కొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందారు. సాధారణంగా సాయంత్రం 6గంటల తర్వాత విచారణ కొనసాగదు. కానీ, కవితను 6గంటల తర్వాత కూడా విచారించడం, ఈడీ కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో శ్రేణుల్లో ఆందోళన మరింత పెరిగింది. అరెస్టు తప్పదన్న ప్రచారం ప్రారంభమైంది. కానీ, చివరికి రాత్రి 8గంటలకు ఈడీ అధికారులు విచారణ ముగించడం, ఈ నెల 16న మరోసారి హాజరు కావాలని చెప్పి పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోసారి హాజరు కావాల్సి ఉండడంతో ఇంకా కొంత ఆందోళనతో ఉంది.

IMG-20230311-WA0238.jpg

కాగా, విచారణ నుంచి బయటికి వచ్చిన కవిత ఉత్సాహంగానే కనిపించారు. కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు చేసినట్లుగానే.. బయటికి వచ్చినప్పుడు కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాత్రి ఢిల్లీలోని తన నివాసం వద్దకు చేరగానే అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో మోతెక్కించారు. ఇంట్లోకి వెళ్లాక మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివా్‌సగౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతితో కవిత కాసేపు మాట్లాడారు. అనంతరం కవిత, మంత్రులు సహా ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు రాత్రి 9గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. రాత్రి 11గంటల తరువాత వారు హైదరాబాద్‌కు చేరుకున్నారు. కవిత, కేటీఆర్‌, హరీశ్‌రావు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆదివారం వారంతా ప్రగతిభవన్‌లోనే ఉండనున్నట్లు, ఈడీ విచారణపై న్యాయనిపుణులతో చర్చించనున్నట్లు తెలిసింది.

ఢిల్లీలో కేటీఆర్‌, హరీశ్‌ మకాం

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఢిల్లీలో మకాం వేశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. అర్ధరాత్రి వరకు న్యాయవాదులు, కవితతో కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. శనివారం ఉదయం నుంచి కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లే వరకూ న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమై రాజకీయపరమైన వ్యూహాలు రచించారు. కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. తొలుత తెలంగాణ భవన్‌ వద్ద బండి సంజయ్‌ దిష్టిబొమ్మను దహనం చేయాలని నేతలకు సూచించారు. విలేకరులతో మాట్లాడాలని మహిళా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కవిత ఈడీ విచారణకు సంబంధించి మీడియాలో వస్తున్న వివరాలను తెలుసుకొని సమీక్షించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

DSC_0865-cc.jpg

ఉద్రిక్తతల నడుమ విచారణకు

ఎమ్మెల్సీ కవిత శనివారం ఉద్రిక్తతల నడుమ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమె హాజరు సందర్భంగా బీఆర్‌ఎస్‌, భారత్‌ జాగృతి కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఢిల్లీలో హల్‌చల్‌ చేశారు. ఉదయం 7గంటల నుంచే వారు సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసమైన 23, తుగ్లక్‌ రోడ్డు బంగ్లాకు చేరుకున్నారు. కవితకు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, వెంకటేశ్‌ నేత, బీబీ పాటిల్‌తోపాటు పలువురు పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, ఇతర న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఈడీ విచారణ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై, అధికారులు అడిగే అవకాశమున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలపై న్యాయ నిపుణులు కవితను సన్నద్ధం చేశారు. ఈ భేటీ అనంతరం ఉదయం 10.55 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. 11.05 గంటలకు వారు ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. ఈడీ అధికారులు కేవలం కవితను మాత్రమే లోనికి అనుమతించారు. ఆమె భర్త అనిల్‌తోపాటు

Updated Date - 2023-03-12T04:08:46+05:30 IST