Bandi Sanjay: బొమ్మలరామారం పీఎస్ నుంచి బండి సంజయ్ తరలింపు
ABN , First Publish Date - 2023-04-05T10:47:20+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను పోలీసులు బొమ్మలరామరం పోలీస్ స్టేషన్ నుంచి తరలించారు.
యాదాద్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay)ను పోలీసులు బొమ్మలరామరం పోలీస్ స్టేషన్ నుంచి తరలించారు. కాసేపట్లో జడ్జి ఎదుట బండి సంజయ్‌ను హాజరుపరుచనున్నారు. వరంగల్ (Warangal)లో టెన్త్ హిందీ పేపర్ వైరల్ అయిన కేసులో బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. బండిపై కుట్ర కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే బండి సంజయ్‌ను తరలిస్తున్న మార్గంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్ మధ్య బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు. సంజయ్‌ను తరలిస్తుండగా కారును బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే బీజేపీ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు బండి సంజయ్‌ను తరలించారు.
మరోవైపు బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana high court)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్‌ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో బీజేపీ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోనున్నారు. అటు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు ఎక్కిడికక్కడ బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు. పలువురు ముందుస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అలాగే బండి సంజయ్‌ను పరామర్శించేందుకు బొమ్మలరామరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.కాసేపట్లో జడ్జి ఎదుట బండి సంజయ్‌ను హాజరుపర్చనున్నారు.