Share News

Yadadri: యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

ABN , First Publish Date - 2023-12-10T20:31:41+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

 Yadadri: యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు స్వామి వారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఆలయ పరిసరాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ఒక్కరోజే రూ. కోటికి పైగా ఆదాయం

భక్తులు భారీ స్థాయిలో దర్శనానికి రావడంతో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో ఒక్కరోజే రూ. కోటి 9లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇంత ఆదాయం రావడం ఈ ఏడాదిలో రెండోసారి ఆలయ అధికారులు వివరించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 5,20,800, కైంకర్యాల ద్వారా రూ. 2,500, సుప్రభాతం ద్వారా రూ. 23,700, బ్రేక్ దర్శనం వల్ల రూ. 10,85,400, వ్రతాల ద్వారా రూ. 12,46,400 ఆదాయం వచ్చింది. వాహన పూజల ద్వారా రూ. 24,400, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 23,85,000, ప్రచారశాఖ ద్వారా రూ.1,31,679, పాతగుట్టలో పూజల ద్వారా రూ. 3,29,200, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 8 లక్షలు వచ్చాయని అధికారులు చెప్పారు. యాదఋషి నిలయం ద్వారా రూ. 3,73,792, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 2,91,096, శివాలయం ద్వారా రూ. 16,500, పుష్కరిణీ ద్వారా రూ. 4,200, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 34,31,490 వచ్చిందని అధికారులు వెల్లడించారు. శాశ్వత పూజలు ద్వారా రూ. 42,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 1,91,900 , అన్నదానం ద్వారా రూ. 28,611, గది విరాళం ద్వారా రూ.11,700 ఆదాయం ఆలయానికి సమకూరిందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-10T20:42:59+05:30 IST