Kavitha: ప్రియాంక, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సత్యదూరం
ABN , First Publish Date - 2023-10-19T11:53:52+05:30 IST
ములుగు కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. బుధవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. ఎవరో రాసిస్తే చదవడం కాదు.. ఎక్కడికక్కడ స్క్రిప్ట్‌ను సరిచూసుకోవాలని హితవుపలికారు. కాళేశ్వరం మిషన్ భగీరథ రెండింటి ఖర్చు లక్ష కోట్లు అని.. మరి లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
నిజామాబాద్: ములుగు కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) స్పందించారు. బుధవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. ఎవరో రాసిస్తే చదవడం కాదు.. ఎక్కడికక్కడ స్క్రిప్ట్‌ను సరిచూసుకోవాలని హితవుపలికారు. కాళేశ్వరం మిషన్ భగీరథ రెండింటి ఖర్చు లక్ష కోట్లు అని.. మరి లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పదే పదే అవే మాటలు మాట్లాడితే అభాసు పాలవుతారన్నారు. రూ.350 కోట్లతో ఆర్మూర్‌లో లిఫ్ట్‌లు తెచ్చామని అన్నారు. కరప్షన్ తమరు చేశారు కాబట్టే రైతుల కళ్ళలో నాడు కన్నీరు నిలిచిందన్నారు. ధరణి బంగాళాఖాతంలో పారేస్తే భూమి హక్కు ఎవరిది అనేది ఎలా తెలియాలి.. రైతు బందు ఎవరికీ వస్తుందని ఎమ్మెల్సీ నిలదీశారు.
పొరపాటున కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందని తెలిపారు. తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య యుద్ధం ఇది అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే కష్టాలు పడ్డామని.. ఆత్మ బలిదానాలు జరిగాయని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యల గురుంచి ఒక్కసారి కూడా రాహుల్ మాట్లాడలేదన్నారు. అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారా అంటూ విమర్శించారు. సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మూతపడే పరిస్థితి వస్తే సీఎం కేసీఆర్ సింగరేణిలో సంస్కరణలు తీసుకొచ్చి ఊపిరి పోశారన్నారు. మోడీయే తమ పథకాలు కాపీ కొడుతున్నారని అన్నారు. ప్రియాంక కుటుంబ పాలన అంటే హాస్యాస్పదంగా ఉందని కవిత వ్యాఖ్యలు చేశారు.