Mlc Kavitha : డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ABN , First Publish Date - 2023-10-10T19:05:29+05:30 IST
డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే(BRS Govt)నని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు.
నిజామాబాద్: డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే(BRS Govt)నని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నిజామాబాద్‌లో పర్యటించారు. కంటేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గీత కార్మిక కుటుంబాలు కవితకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం. కన్న తల్లి వంటి కుల వృత్తులకు కేసీఆర్ పాలనలో పూర్వ వైభవం వచ్చింది. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను, కల్లు వ్యాపారాన్ని చిన్నచూపు చూశాయి. అలాంటి కులవృత్తులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పాలసీగా తీసుకొని ఈత వనాలని పెంచుతోంది. మద్యం టెండర్లలో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం. నిజామాబాద్ జిల్లాకు ఒకటే బీసీ హాస్టల్ ఉండే... అలాంటిది ఈరోజు 15 బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికలపుడు అనేక పార్టీలు వస్తాయి.. వారిని నిలదీయాలని కవిత పేర్కొన్నారు.