Kavitha: ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
ABN , First Publish Date - 2023-07-21T16:33:13+05:30 IST
నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆమె మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. నిరాధారంగా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలే ఎంపీకి బుద్ది చెపుతారన్నారు.
నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఫైర్ అయ్యారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆమె మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. నిరాధారంగా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలే ఎంపీకి బుద్ది చెపుతారన్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న అరవింద్ 24 గంటల్లో నిరూపించాలని.. లేకుంటే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేయాలని, నోటికి వచ్చినట్లు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 62 లక్షల మందికి పెన్షన్ (Pension) ఇస్తున్నామని, ఇందులో కేంద్రం వాటా ఒక్క రూపాయి కూడా లేదన్నారు. ఎంపీగా అరవింద్ నిజామాబాద్ జిల్లాకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు పబ్బం గడుపుతారన్నారు. బీజేపీది ఎన్నికల పాలసీ అని, తమది ప్రజా సంక్షేమ పాలసీ అని అన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఒక్కటేనని, అది బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.