MLC Kavitha: కేసీఆర్ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచారు

ABN , First Publish Date - 2023-10-01T22:01:40+05:30 IST

సీఎం కేసీఆర్ 6 శాతం ఉన్నఎస్టీ (ST) రిజర్వేషన్లు 10 శాతం వరకు పెంచారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించారు.

MLC Kavitha: కేసీఆర్ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచారు

నిజామాబాద్: సీఎం కేసీఆర్ 6 శాతం ఉన్నఎస్టీ (ST) రిజర్వేషన్లు 10 శాతం వరకు పెంచారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బంజారా భవనం శంకుస్థాపన చేశారు. ఈ సభలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ...‘‘బంజారా సోదరులకు కేసీఆర్ చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. 10 లక్షల మంది పేదల ఇంటికి కల్యాణలక్ష్మి వచ్చింది అంటే అది కేసీఆర్ పుణ్యం. ప్రధానమంత్రి మోదీని ఎస్టీ (ST) రిజర్వేషన్లు పెంచాలని అంటే ఇంత వరకు పెంచలేదు. ఎస్టీ(ST)లకు 90 వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మాది. ఏ ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది’’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Updated Date - 2023-10-01T22:01:40+05:30 IST