MP Arvind: ప్రధాని వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరించారు

ABN , First Publish Date - 2023-09-20T14:01:39+05:30 IST

న్యూఢిల్లీ: తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మే పరిస్థితి లేదని, ప్రధాని మోదీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించి విమర్శిస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

MP Arvind: ప్రధాని వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరించారు

న్యూఢిల్లీ: తెలంగాణ (Telangana) సమాజం కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla family) మాటలు నమ్మే పరిస్థితి లేదని, ప్రధాని మోదీ (PM Modi) వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ (Minister KTR) వక్రీకరించి విమర్శిస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) - బీఆర్ఎస్‌ (BRS) నేతలు ప్రధానిపై ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాసుబ్రహ్మనంద రెడ్డి హయాంలో తెలంగాణ కోసం పోరాడిన వారిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, తెలంగాణలో విధ్యార్ధులు, అమరవీరుల ప్రాణత్యాగాలకు కారణం సోనియా గాంధీ (Sonia Gandhi)యేనని విమర్శించారు. గతంలో బీజేపీ కొత్త రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎటువంటి హింసాత్మక ఘటనలు, ప్రాణత్యాగాలు జరగలేదన్నారు. తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు.

తెలంగాణ వచ్చి 9.5 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ యువతకు ఏం చేసారో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. కేటీఆర్, కవిత (Kavita)లు వేల కోట్లు సంపాదించారని, రాష్ట్రంలో సారా ఏరులై పారుతోందని, ఉద్యమం సందర్భంగా యువతను రెచ్చగొట్టి ప్రాణత్యాగాలు చేయించారని, కేటీఆర్, కవితలు స్కాంలతో తెలంగాణను లూటీ చేసారని అన్నారు. తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల కుటుంబం చరిత్ర మొత్తం తెలుసునని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) కోసం కవిత తన తండ్రిపైనే ఇప్పటి వరకు ఒత్తిడి చేయలేదని, అలాంటిది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR) కేబినెట్‌లో, శాసనసభ్యులకు ఇచ్చిన టికెట్లలో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారు?.. కవిత ఈ ప్రశ్న కేసీఆర్‌ను అడగాలని ధర్మపురి అర్వింద్ అన్నారు.

Updated Date - 2023-09-20T14:01:39+05:30 IST