Mohammed siraj: ఇండియా - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు యత్నం.. ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2023-04-19T14:03:58+05:30 IST

ఇండియా - ఆస్ట్రేలియా వన్డేలో ఫిక్సింగ్‌కు ఏపీకి చెందిన పంటర్ ప్రయత్నించాడు.

Mohammed siraj: ఇండియా - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు యత్నం.. ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్

Hyderabad : ఇండియా - ఆస్ట్రేలియా వన్డేలో ఫిక్సింగ్‌కు ఏపీకి చెందిన ఓ పంటర్ ప్రయత్నించాడు. దీని కోసం ఫాస్ట్‌ బౌలర్‌, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ను సంప్రదించాడు. తాను బెట్టింగ్‌లో చాలా డబ్బు పోగొట్టుకున్నానని, తనను ఆదుకోవాలని సిరాజ్‌ను వేడుకున్నాడు. ఈ మేరకు సిరాజ్‌‌కు ఆ వ్యక్తి వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించాడు. అయితే ఈ విషయాన్ని సిరాజ్ బీసీసీఐ (BCCI) దృష్టికి తీసుకెళ్లాడు. అవినీతి నిరోధక యూనిట్‌‌కి సమాచారం అందించాడు.

సిరాజ్‌కు మెసేజులు పంపిన పంటర్‌ను బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ పట్టుకుంది. సదరు పంటర్‌.. హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌గా గుర్తించింది. పంటర్‌కు ఏ గ్యాంగ్‌తో సంబంధాలు లేవని అధికారులు గుర్తించారు. కాగా మార్చి 19న వైజాగ్‌లో ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరిగింది. ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఆ వ్యక్తి ఉన్నాడు.

Updated Date - 2023-04-19T15:52:46+05:30 IST