Revanth Reddy: కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ | Revanth Reddy counter tweet to KTRs tweet RVRAJU

Revanth Reddy: కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్

ABN , First Publish Date - 2023-10-11T18:30:24+05:30 IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ట్వీట్ ఇచ్చారు.

Revanth Reddy: కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ట్వీట్ ఇచ్చారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

"దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా?. సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా?. కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక... కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా?. మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా?. తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి... ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుంది." అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2023-10-11T18:30:33+05:30 IST