MLC Kavitha : ఢిల్లీకి మారిన తెలంగాణ రాజకీయం.. క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు
ABN , First Publish Date - 2023-03-11T09:18:27+05:30 IST
ఎమ్మెల్సీ కవిత 10 గంటల తర్వాత ఈడీ విచారణకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేరుకున్నారు.
ఢిల్లీ : ఎమ్మెల్సీ కవిత 10 గంటల తర్వాత ఈడీ విచారణకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. నిన్ననే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, కేశవరావు, నామ నాగేశ్వర రావు సహా పలువురు బీఆర్ఎస్ ఎంపీలు సైతం కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు సైతం అక్కడకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ నివాసంలో జాగృతి ప్రతినిధులకు కవిత అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డ ఆమెకు మద్దతు తెలిపేందుకు వచ్చామని తెలిపారు. దేశ విదేశాల్లో తెలంగాణ జాగృతి పేరిట అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవిత కీలక పాత్ర పోషించిందన్నారు.