Chandrababu Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన కమ్మసంఘం

ABN , First Publish Date - 2023-09-11T16:24:22+05:30 IST

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను కమ్మ సేవా సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ను అక్రమ అరెస్ట్ పై కమ్మవారి సేవా సంఘాలు(Kammavari Seva Sanghalu) సోమవారం నాడు సమావేశం నిర్వహించాయి.

Chandrababu Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన కమ్మసంఘం

వరంగల్: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను కమ్మ సేవా సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ను అక్రమ అరెస్ట్ పై కమ్మవారి సేవా సంఘాలు(Kammavari Seva Sanghalu) సోమవారం నాడు సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో కమ్మసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్(Ramakrishna Prasad) హాజరయ్యారు ఈ సందర్భంగా కమ్మ సేవా సంఘాల సమాఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు సుపరిపాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేశారని చెప్పారు. దేశంలో రాజకీయ నేతలకు మార్గదర్శిగా చంద్రబాబు ఉన్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు. రాజకీయ పార్టీలు హుందాగా రాజకీయాలు చేయాలని సూచించారు. ధర్మం, న్యాయం చివరగా గెలుస్తుందన్నారు. రెండు రోజుల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనలకు కార్యచరణ రూపొందిస్తామని కమ్మ సేవా సంఘాల సమాఖ్య ప్రతినిధులు చెప్పారు.

Updated Date - 2023-09-11T16:24:22+05:30 IST