Revanth Reddy: పల్లా రాజేశ్వర్‌రెడ్డి వల్లే కేయూలో గొడవలు

ABN , First Publish Date - 2023-09-13T16:42:57+05:30 IST

పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy)వల్లే కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో గొడవలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

Revanth Reddy: పల్లా రాజేశ్వర్‌రెడ్డి వల్లే కేయూలో గొడవలు

హైదరాబాద్: పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy)వల్లే కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో గొడవలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కేయూలో దీక్ష చేపట్టిన విద్యార్థుల(KU students)ను రేవంత్‌రెడ్డి కలిశారు. విద్యార్థులతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రేవంత్ విద్యార్థులతో మాట్లాడుతూ.... ‘‘ కేయూ విద్యార్థులకు కాంగ్రెస్(Congress) అండగా ఉంటుంది. అర్హతలేని వారికి, బీఆర్ఎస్ జెండా మోసిన వారికి PHD అడ్మిషన్లు ఇచ్చి.. అర్హులకు అన్యాయం చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడారు.ఈ అక్రమాలల్లో వీసీ, రిజిస్ట్రార్‌కు భాగస్వామ్యం ఉంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy)కి బంట్రోతుగా మారిన వ్యక్తి కేయూ వీసీగా పనిచేస్తున్నారు.యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తే అడిగే నాథుడే లేరు. పోరాడిన విద్యార్థులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులతో దాడి చేయించారు. వీధిరౌడీల్లా విద్యార్థుల కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.కేయూ వీసీని వెంటనే భర్తరఫ్ చేయాలి.

కేసీఆర్(KCR) దొరపోకడులను ప్రశ్నిస్తున్నారని యూనివర్సిటీల ను కాలగర్భంలో కలిపేయాలనుకుంటున్నారా..?. పల్లా నుంచి యూనివర్సిటీని కాపాడుకోవాలి. కేయూను పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) నిర్వీర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే PHD అడ్మిషన్ల అవకతవకలపై విచారణ జరిపిస్తాం.విద్యార్థులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిది. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. PHD అక్రమ అడ్మిష‌న్లను రద్దు చేయాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్(Ranganath) ఈప్రాంతం వారు కాదు.సీపీ రంగనాథ్ విద్యార్థులను కొట్టించారని తెలిసింది. ఇప్పటికైనా నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలి.మెస్‌లు బంద్ చేయడం, సెలవులు పొడిగించడం సమస్యకు పరిష్కారం కాదు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-13T16:55:00+05:30 IST