YS Sharmila: అమెరికాలో కూడా కోతలు ఉంటాయట... ఇక్కడ మాత్రం ఉండవట... షర్మిల ఎద్దేవా
ABN , First Publish Date - 2023-02-10T13:30:34+05:30 IST
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.
జనగామ: వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రఘునాథ్‌పల్లి సబ్‌స్టేషన్ ఎదుట షర్మిల మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అని కేసీఆర్ (Telangana CM) గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతలు లేకుండా పాలన అని అసెంబ్లీ (Telangana Assembly) సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. ‘‘అమెరికాలో అయినా కరెంట్ కోతలు ఉంటాయట.. తెలంగాణలో మాత్రం ఉండవట. 24 గంటలు క్షణం కూడా పోకుండా కరెంట్ ఇస్తున్నారట’’ అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు 24 గంటలు ఇస్తున్నాం కాబట్టి అధికారంలో ఉంటామని చెప్తున్నారన్నారు. దొంగ మాటలు చెప్తుంది కేసీఆర్ (BRS Chief) దొంగల ముఠా అని విమర్శించారు. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలంగాణ రైతాంగాని (Telangana Farmers)కి అంతా తెలుసన్నారు. రైతులకు వాస్తవ స్థితి అంతా తెలుసన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తదో రైతుకు కూడా తెలియడం లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.