Lokesh: లోకేష్ పాదయాత్రలో పోలీసుల దౌర్జన్యం.. బ్యానర్లు, జెండాలు తొలగింపు
ABN, First Publish Date - 2023-02-16T17:53:34+05:30 IST
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) దౌర్జన్యానికి దిగారు.
తిరుపతి: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) దౌర్జన్యానికి దిగారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్న రూట్‌లో టీడీపీ జెండాలు, బ్యానర్లను పోలీసులు తొలగించారు. జెండాలను తొలగించి పోలీసు వాహనాల్లోనే తరలిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా యువగళం పాదయాత్రపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రపై పోలీసులు అడ్డగోలు ఆంక్షలు పెడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న రూట్లలో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన టీడీపీ జెండాలు, బ్యానర్లను పోలీసులు తొలగిస్తున్నారు. సిబ్బందితో చేయించాల్సిన పనులను కూడా పోలీసులే చేస్తున్నారు. జెండాలను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు జులుం చూపిస్తున్నారు.
ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. లోకేష్ బస చేయనున్న ప్రాంతంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన టీడీపీ జెండాలను తొలగించి పోలీసు వాహనాల్లో తీసుకెళ్లారు. లోకేష్ పాదయాత్రకు విశేషమైన స్పందన రావడంతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడులో లోకేష్ యాత్రకు విశేష స్పందన వస్తోందని, ఇక్కడ ఉన్న అనేక అక్రమాలపై లోకేష్ మాట్లాడుతున్న క్రమంలో.. తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ఎర్రచందనం, మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు లోకేష్‌కు చెబుతున్నారు. పెద్దపెద్ద ట్రక్‌లతో అక్రమ రవాణా చేయడం వల్ల గ్రామీణ రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ అంశాలను లోకేష్ బహిరంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలో పోలీసులు 4 పోలీసు స్టేషన్ల మధ్య అంతర్గత బదిలీలుగా చేసుకుంటున్నారని, ఇది పూర్తిగా ఒక అక్రమ వ్యవహారానికి సత్యవేడు ఒక అడ్డగా మారిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సత్యవేడులో జరుగుతున్న అక్రమాలపై వ్యతిరేకతతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి లోకేష్ పాదయాత్రను మిగిలిన ప్రాంతాల కంటే పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నారు. స్థానికంగా ఉన్న పోలీసులు లోకేష్ పాదయాత్రపై ఓవర్ యాక్షన్ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
*********************************************************
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం
***************************************************************
పెళ్లికి పనికిరాను.. నన్ను చేసుకుంటే మీకూ నష్టమే.. ఇదీ కాబోయే భర్త తమ్ముడికి ఓ యువతి వాయిస్ మెసేజ్.. ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!
***************************************************************************
Updated at - 2023-02-16T19:07:19+05:30