Share News

Gadde Rammohan: జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం

ABN , Publish Date - Jul 01 , 2024 | 07:46 AM

తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. వరలక్ష్మీ నగర్, నాగార్జున నగర్, పోలీస్ కాలనీల్లో పేదలకు స్వయంగా గద్దె రామ్మోహన్ పెన్షన్ అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ‌ పెన్షన్ తొలగించారని ఎమ్మెల్యేకు పలువురు వృద్దులు తెలిపారు. ఆగస్ట్‌లో అర్హత ఉన్న వారికి పెన్షన్ లు మంజూరు చేసేలా చూస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు.

Gadde Rammohan: జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం

విజయవాడ: తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. వరలక్ష్మీ నగర్, నాగార్జున నగర్, పోలీస్ కాలనీల్లో పేదలకు స్వయంగా గద్దె రామ్మోహన్ పెన్షన్ అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ‌ పెన్షన్ తొలగించారని ఎమ్మెల్యేకు పలువురు వృద్దులు తెలిపారు. ఆగస్ట్‌లో అర్హత ఉన్న వారికి పెన్షన్ లు మంజూరు చేసేలా చూస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రంలో పెన్షన్ పండుగ ప్రారంభమైందన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం జగన్ బటన్ నొక్కారన్నారు. పేదల సంక్షేమమే ముఖ్యంగా చంద్రబాబు వారి ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారన్నారు.


పేదలు ఎవరో, పెత్తందారులు ఎవరో‌ ప్రజలు గుర్తించారన్నారు. అందుకే జగన్నాటకాలు తెలుసుకుని ప్రజలు 11 స్థానాలతో సరిపెట్టారని గద్దె రామ్మోహన్ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటను వెంటనే అమలు చేశారన్నారు. జగన్ రెండు నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్లు తీసుకున్నారు. జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం చేశారన్నారు. గతంలో కూడా రెండు వందల నుంచి పింఛన్‌ను రెండు‌వేలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పెంచిన నాలుగు వేలకు మరో మూడు వేలు కలిపి నేడు ఏడు వేలు ఇస్తున్నారన్నారు. నాటకాలతో ఓట్ల రాజకీయం చేసిన వ్యక్తి జగన్ అయితే, పేదల పట్ల చిత్తశుద్ధి ఉన్న నేత చంద్రబాబు అని గద్దె రామ్మోహన్ తెలిపారు.


సాయం అంటే గుండెతో చేయాలి కానీ... ఓట్ల కోసం చేయడం సాయం కాదని జగన్‌కు సూచించారు. ప్రజలు ఇది అర్ధం చేసుకునే వైనాట్ 175 అన్న వ్యక్తిని 11 కే పరిమితం చేశారని గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇప్పుడు అయినా వారు ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారన్నారు. ఆర్ధిక భారాలు ఉన్నా పేదల సంక్షేమం ముఖ్యం అని చంద్రబాబు అన్నారన్నారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబు ప్రత్యేకత అని కొనియాడారు. ఆ రాష్ట్ర సంపదను గతంలో వైఎస్, ఇప్పుడు జగన్ దోచుకున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ముంచేసి అప్పుల రాష్ట్రంగా జగన్ మిగిల్చారన్నారు. రాజకీయ కారణాలతో పెన్షన్ తొలగించి పేదల కడుపు కొట్టారన్నారు. అర్హత ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆగస్ట్‌లో పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 07:47 AM