IRR Case: చంద్రబాబు కేసులో సీఐడీకి షాక్!
ABN , Publish Date - Feb 09 , 2024 | 06:11 PM
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ వేసిన ఛార్జిషీట్‌ను విజయవాడ ఎసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని...
విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ వేసిన ఛార్జిషీట్‌ను విజయవాడ ఎసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. సీఐడీ అధికారులు గురువారం ఎసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, రాజశేఖర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. అయితే శుక్రవారం ఈ కేసుపై జరిగిన విచారణలో సీఐడీ చార్జ్‌షీట్‌ను కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.