Share News

ANMS : అదనపు బాధ్యతలు తప్పించండి

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:59 PM

క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు పడుతూ వైద్య పథకాలు, సేవలు అందిస్తున్న ఏఎనఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో మరింత కష్టమవుతోందని ఏఎనఎంలు కలెక్టరు వద్ద వాపోయారు. ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు బుధవారం ఏఐ టీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజేష్‌గౌడు తదితరులతో కలిసి కలెక్టరు వినోద్‌కుమార్‌ను కలెక్టరేట్‌లో కలిశారు.

ANMS :  అదనపు బాధ్యతలు తప్పించండి
AITUC leaders and ANMs giving petition to the Collector

కలెక్టరుకు ఏఎనఎంల వినతి

అనంతపురం టౌన, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు పడుతూ వైద్య పథకాలు, సేవలు అందిస్తున్న ఏఎనఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో మరింత కష్టమవుతోందని ఏఎనఎంలు కలెక్టరు వద్ద వాపోయారు. ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు బుధవారం ఏఐ టీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజేష్‌గౌడు తదితరులతో కలిసి కలెక్టరు వినోద్‌కుమార్‌ను కలెక్టరేట్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పీహెచసీ వైద్యాధికారి పర్యవేక్షణలోనే పని చేయాలని, అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ఏఎన ఎంలను వినియోగించరాదని ఉత్తర్వులు ఉన్నాయన్నారు. అయితే తమకు పింఛన్ల పంపిణీ, ఎనసీడీసీడీ సర్వే విధులు, హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ వంటి పనులు అప్పగిస్తున్నారని, దీనివల్ల అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అదనపు బాధ్యతల భారం నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కృష్ణుడు, రాజు, చిరంజీవి, ఏఎనఎంలు రజని, విజయభారతి, రమాదేవి, శకుంతల, బాను తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 06 , 2024 | 11:59 PM